స్పైస్‌ జెట్‌ స్పైసీ ఫెస్టివ్‌ ఆఫర్‌

- December 18, 2016 , by Maagulf
స్పైస్‌ జెట్‌ స్పైసీ ఫెస్టివ్‌ ఆఫర్‌

దుబాయ్‌ నుంచి ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు స్పైస్‌జెట్‌ సంస్థ ఫెస్టివ్‌ ఆఫర్‌ని ప్రకటించింది. ఇండియాలోని మొత్తం 11 నగరాలకు దుబాయ్‌ నుంచి వెళ్ళే ప్రయాణీకులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ ద్వారా విమాన ధరలు 259 అరబ్‌ ఎమిరేట్స్‌ దినార్స్‌ నుండి ప్రారంభమవుతాయి. విమాన టిక్కెట్లను 18 డిసెంబర్‌ 2016 నుంచి 21 డిసెంబర్‌ 2016 వరకు బుక్‌ చేసుకున్నవారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 15 జనవరి 2017 నుంచి 28 అక్టోబర్‌ 2017 మధ్య ప్రయాణ కాలానికి ఈ ఆఫర్‌ వర్తిస్తుందని స్పైస్‌జెట్‌ ప్రకటించింది. టిక్కెట్లను స్పైస్‌జెట్‌ మొబైల్‌ యాప్‌లో బుక్‌ చేసుకున్నవారికి అదనంగా మరికొన్ని డిస్కౌంట్లను, అలాగే మీల్స్‌పై 50 శాతం ఆఫర్‌ని ఇవ్వనున్నట్లు సైస్‌జెట్‌ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com