ఇండియన్స్‌కి సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్‌పోర్ట్
- December 18, 2016
ఇండియన్స్‌కి సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్‌పోర్ట్
మస్కట్: సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్‌పోర్ట్‌లు అందుబాటులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భారత పార్లమెంటులో కేంద్ర మంత్రి వికె సింగ్, ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఇ-పాస్‌పోర్ట్‌కి సంబంధించిన ప్రాసెస్ నడుస్తోందని చెప్పారు. ఇ-పాస్‌పోర్ట్‌లో ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. పాస్‌పోర్ట్ డేటా పేజ్‌లో ఏదైతే సమాచారం ఉంటుందో, ఆ సమాచారమంతా చిప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. సరికొత్త భద్రతా ఫీచర్లతో ఈ ఇ-పాస్‌పోర్ట్‌లను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్రం వెల్లడించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇ-పాస్‌పోర్ట్ మ్యాన్యుఫ్యాక్చురర్ ఎవరనేది తెలియనుంది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,17,37,358 మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు. ఒమన్‌లో 7,96,001 మంది నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ
- డాలస్ లో మహత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా 157వ గాంధీ జయంతి వేడుకలు
- దుబాయ్‌లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలు
- ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!







