ఇండియన్స్‌కి సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్‌పోర్ట్‌

- December 18, 2016 , by Maagulf
ఇండియన్స్‌కి సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్‌పోర్ట్‌

ఇండియన్స్‌కి సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్‌పోర్ట్‌ 
మస్కట్‌: సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్‌పోర్ట్‌లు అందుబాటులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భారత పార్లమెంటులో కేంద్ర మంత్రి వికె సింగ్‌, ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఇ-పాస్‌పోర్ట్‌కి సంబంధించిన ప్రాసెస్‌ నడుస్తోందని చెప్పారు. ఇ-పాస్‌పోర్ట్‌లో ఎలక్ట్రానిక్‌ చిప్‌ ఉంటుంది. పాస్‌పోర్ట్‌ డేటా పేజ్‌లో ఏదైతే సమాచారం ఉంటుందో, ఆ సమాచారమంతా చిప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. సరికొత్త భద్రతా ఫీచర్లతో ఈ ఇ-పాస్‌పోర్ట్‌లను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్రం వెల్లడించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇ-పాస్‌పోర్ట్‌ మ్యాన్యుఫ్యాక్చురర్‌ ఎవరనేది తెలియనుంది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,17,37,358 మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు. ఒమన్‌లో 7,96,001 మంది నివసిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com