ఫైర్ సేఫ్టీ: టెనెంట్స్పై కొత్త చట్టం త్వరలో
- December 18, 2016
దుబాయ్: యూఏఈలో టెనెంట్స్ ఇకపై ఫైర్ సేఫ్టీ విషయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తే భారీ జరీమానాలు ఎదుర్కొనక తప్పకపోవచ్చు. ఆ దిశగా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారు. మానవ తప్పిదాల కారణంగా జరిగే అగ్ని ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకుగాను ఈ చట్టాన్ని తీసుకురావాలని సంకల్పించారు. గత వారంలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో సీనియర్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారఱ. 2017 మొదట్లోనే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారమ్. ఈ చట్టంలోని ఓ చాప్టర్, ఫైర్ సేఫ్టీకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే నిబంధనలు ఉల్లంఘించేవారిపై తీసుకునే చర్యల గురించి పేర్కొనున్నారు. ఈ విషయాన్ని ఇన్స్పెక్షన్ అండ్ పర్మిటింగ్ - దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఫస్ట్ లెఫ్టినెంట్ తాహిర్ హాసన్ అల్ తాహెర్ వెల్లడించారు. డెవలపర్స్, కన్సల్టెంట్స్, ఓనర్స్, టెనెంట్స్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇందులో స్టేక్హోల్డర్స్గా పేర్కొనబడ్తారు. మానవ తప్పిదం కారణంగా అగ్ని ప్రమాదం జరిగితే అద్దెకున్నవారు, యజమాని సహా ప్రతి ఒక్కరూ బాధ్యులుగా గుర్తించబడేలా చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటివరకూ అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఓనర్స్ మీదనే చర్యలుండేవనీ, టెనెంట్స్ని కూడా బాధ్యులుగా చేస్తే ప్రమాదాల నివారణ తగ్గుతుందనీ, నిర్లక్ష్యం ఇకపై కనిపించబోదని అధికారులు తెలిపారు. వెలుగుతున్న సిగరెట్లను విసిరివేయడం, బార్బిక్యూ, షిషా స్మోకింగ్, అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే ఇతరత్రా విషయాలకు సంబంధించి జరీమానాలు కఠినంగా ఉండబోతున్నాయి.
తాజా వార్తలు
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ
- డాలస్ లో మహత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా 157వ గాంధీ జయంతి వేడుకలు
- దుబాయ్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలు
- ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!







