డిశ్చార్జి కానున్నారు సుష్మాస్వరాజ్!
- December 19, 2016
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. ఈ నెల 10న ఆమెకు ఇక్కడి ఎయిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవడంతో ఆమెను డిశ్చార్జి చేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
20ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్న సుష్మాస్వరాజ్ నవంబర్ 7న కిడ్నీ విఫలమవడంతో ఎయిమ్స్‌లో చేరారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా ఆమె ట్వీట్ల ద్వారా కొందరికి సహాయపడిన సంగతి తెలిసిందే. ఆదివారం కూడా ఓ మహిళ అభ్యర్థనను మన్నించి ఆమె భర్త మృతదేహాన్ని జపాన్ నుంచి స్వదేశం తెప్పించేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ మేరకు ఆస్పత్రి నుంచే ఏర్పాట్లు చేశారు. వినూత్న రీతిలో ట్విట్టర్ డిప్లొమసీ ద్వారా పనులు సాధిస్తున్న సుష్మను ఇటీవలే ఫారెన్ పాలసీ మ్యాగజైన్ గ్లోబల్ థింకర్స్ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!







