పాక్ లో పెద్ద నోట్లకు షాక్
- December 19, 2016
పెద్ద నోట్ల రద్దుపై భారత్ తీసకున్న నిర్ణయం మాదిరిగానే పాకిస్థాన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. నల్లధన ప్రవాహాన్ని ఆపేందుకు తమ దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్లను దశల వారీగా రద్దు చేయడానికి పాక్ సెనేట్ ఆమోదించింది. మొదటగా అతి పెద్ద నోటైన రూ.5000లను రద్దు చేసేందుకు ఒక తీర్మానాన్ని ఆమోదించిందించినట్లు డాన్ పత్రిక పేర్కొంది. పాకిస్థాన్ ముస్లీం లీగ్ పార్టీకి చెందిన సెనేటర్ ఉస్మాన్ సైఫ్ ఉల్లా ఖాన్ ఎగువ సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. మెజారిటీ సభ్యుల మద్దతుతో సభ పొందింది. ఉస్మాన్ మాట్లాడుతూ బ్యాంకు అకౌంట్లను ప్రోత్సహించి, డిజిటల్ వ్యవస్థను పెంపొందించాలని, నగదు రహితంవైపు అభివృద్ధి కొనసాగించాలన్నారు.
న్యాయ శాఖ మంత్రి జాహిద్ హమిద్ దీనిపై స్పందిస్తూ ప్రస్తుతం ఈ చర్య ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుందని, కాని నదగదు రహిత దేశం దిశగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్షాళనతో మూడు నుంచి ఐదేళ్లలో పరిస్థితి మెరుగు పడుతుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో 34 లక్షల నోట్లు ఉన్నాయని, అందులో 10.20 లక్షలు ఐదు వేల నోట్లేనని, వాటిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పాక్ పత్రిక డాన్ పేర్కొంది.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్‌పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్‌కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్‌లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









