రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.!

- December 19, 2016 , by Maagulf
రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.!

రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. అన్ని రైళ్లలో ఆర్‌ఏసీ కోటాను పెంచాలని నిర్ణయించింది. జనవరి 16 నుంచి అన్ని రైళ్లలో అదనపు ఆర్‌ఏసీ కోటాను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. ఆర్‌ఏసీ విభాగంలో ప్రయాణించేవారి సంఖ్యను పెంచుతూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో స్లీపర్‌ కోచ్‌లో ఐదు సైడ్‌లోయర్‌ బెర్తుల్లో పది మందికి, మూడో తరగతి ఏసీ కోచ్‌లో రెండు సైడ్‌ లోయర్‌ బెర్తుల్లో ఇద్దరిని, రెండో తరగతి ఏసీ కోచ్‌లో లోయర్‌ బెర్తులో మరో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతించేవారు. తాజాగా ఆ సంఖ్యను పెంచుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.

స్లీపర్‌ కోచ్‌, మూడో తరగతి ఏసీలో మరో రెండు లోయర్‌ బెర్తుల్లో ఆర్‌ఏసీ ప్రయాణికులు ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. రెండో తరగతి ఏసీలో మరో లోయర్‌ బెర్తును ఆర్‌ఏసీ విభాగంలోకి చేర్చింది. గతంలో స్లీపర్‌, రెండో తరగతి, మూడో తరగతి ఏసీల్లో ఆర్‌ఏసీ కింద 18 మంది ప్రయాణించే వీలువుండగా, ప్రస్తుత నిర్ణయంతో అదనంగా మరో 10మంది ఆర్‌ఏసీ ప్రయాణికులకు ప్రయోజనం దక్కనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com