40 కేజీల బంగారం పట్టివేత
- December 19, 2016
ఓ ఎగుమతి దారుడి నుంచి ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు 40 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువు దాదాపు పన్నెండు కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో బడా బాబుల వద్ద ఉన్న నల్లధనాన్ని బంగారంగా మార్చే చర్యల్లో భాగంగానే అతడు ఇంత పెద్ద బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. నోయిడాలోని స్పెషల్ ఎకనామిక్ జోన్(ఎన్‌ఎస్‌ఈజెడ్) నుంచి ఇతడు దేశీయ మార్కెట్ కు బంగారం పంపిణీ దారుడిగా పనిచేస్తున్నాడు.
దుబాయి నుంచి ఎన్‌ఎస్‌ఈజెడ్ ఆభరణాలు తయారు చేసి విక్రయించేందుకు గాను బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.
అనంతరం అదే ఆభరణాలను దుబాయ్ కు ఎగుమతి చేస్తుంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పటికే దేశీయ మార్కెట్లోకి దాదాపు రూ.150 కోట్ల విలువైన బంగారం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ బంగారాన్నంత కొంతమంతి బడా బాబుల వద్ద ఉన్న అక్రమ సంపాదనను తెల్లడబ్బుగా మార్చేందుకు ఉపయోగించినట్లు సమాచారం. బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లి అనంతరం రిమాండ్ కు తరలించారు.
మరోపక్క, మీరట్ లో ఓ ప్రభుత్వ సంస్థలో ఇంజినీర్ గా పనిచేస్తున్న ఆర్ కే జైన్ అనే వ్యక్తి వద్ద నుంచి ఐటీ అధికారులు రూ.2.67కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 17 లక్షలు కొత్త కరెన్సీ ఉంది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







