సోలార్ హెల్మెట్: ఎండలోనూ చల్లచల్లగా
- December 19, 2016
ఖతార్‌లోని రీసెర్చర్స్ ఎండలో పనిచేసే కార్మికుల కోసం సోలార్ హెల్మెట్లను డిజైన్ చేశారు. ఈ హెల్మెట్ల ద్వారా బయట ఉన్న ఎండ నుంచి కార్మికులకు ఉపశమనం లభించనుంది. ఉష్ణోగ్రతను తగ్గించడం తద్వారా ఒత్తిడి తగ్గడంతో ఎండలో అయినా కార్మికులు మరింత ఉతాష్ట్ర్సహంగా పనిచేయగలుగుతారని సోలార్ హెల్మెట్ డిజైన్ చేస్తున్న ఎస్సి - ఎస్పైర్ సంస్థ ప్రతినిథులు తెలిపారు. దీనికి సంంధించి అన్ని విధాల పరీక్షలూ పూర్తయ్యాయి. అలాగే పేటెంట్ హక్కుల్నీ దక్కించుకున్నట్లు ఎస్పైర్ - ఎస్సి సంయుక్తంగా ప్రకటించాయి. తక్కువ బరువుతోనే ఉండే ఈ హెల్మెట్లు కార్మికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ తరహా హెల్మెట్లు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ సంచలనాలు సృష్టించగలవని వారు అంచనా వేశారు. ఎస్పైర్ - స్పోర్ట్ ప్రాజెక్ట్స్ డిప్యూటీ ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ అల్ మహమౌద్ మాట్లాడుతూ, ఈ తరహా హెల్మెట్లను రూపొందించడం ద్వారా సరికొత్త సంచలనాలకు తెరలేపినట్లు భావిస్తున్నామనీ, ఇది తమకెంతో గర్వకారణంగా ఉందని అన్నారు. ఎండలో ఉత్పన్నమయ్యే చెమట దగ్గర్నుంచి, అన్ని విషయాల్నీ పరిశోధించి సోలార్ హెల్మెట్లను రూపొందించారు. సాధారణ హెల్మెట్‌తో పోల్చితే ఈ సోలార్ హెల్మెట్‌కి 20 డాలర్లు అధికంగా ఖర్చవుతుంది. అయితే ఈ సోలార్ హెల్మెట్ ఇచ్చే ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువ.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







