నూతన సంవత్సర వేడుకలపై నిషేధం!
- December 20, 2016
కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడడం, సందడిచేయడం అక్కడ ఈ ఏడాది నిషేధం. బంగ్లాదేశ్లో నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తూ హోం మంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమల్ ఆదేశాలు జారీ చేశారు. నూతన సంవత్సరం రోజున ప్రజలు గుంపులు గుంపులుగా బహిరంగ ప్రదేశాల్లో కలుసుకోవడం, ప్రదర్శనలు ఇస్తూ సంబరాలు చేసుకోవడం వంటి వాటిపై డిసెంబరు 31 సాయంత్రం ఆరు తర్వాత నుంచి నిషేధం విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు క్రిస్మస్ పండుగ రోజు దేశవ్యాప్తంగా ఉన్న చర్చిల దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఇళ్లలోను పార్టీలు వంటివి జరుపుకోవాలని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది.
సాయంత్రం ఆరు తర్వాత నుంచి పబ్బులు మూసివేయాలని, ఎటువంటి బాణసంచాలు కాల్చేందుకు వీల్లేదని మంత్రి వెల్లడించారు. న్యూఇయర్ రోజు కొందరు యువత చట్టాలను అతిక్రమించి కూడని పనులు చేస్తున్నారని, అటువంటి వాటిని నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. న్యూఇయర్ రోజు ఢాకాలోని గుల్షాన్-బరిధర-బనాని తదితర నివాస ప్రాంతాల్లో పోలీసుల గస్తీ పెంపొందిస్తామన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.
తమ ఆనందాన్ని అడ్డుకుంటున్నారంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









