పాలక్ ఫిష్ కిచిడీ..
- December 20, 2016
కావలసినవి: బియ్యం- 100 గ్రాములు, చేపముక్కలు- 100 గ్రాములు, నెయ్యి - 30 గ్రాములు, ఒక ఉల్లిపాయ ముక్కలుగా తరిగినది, పాలకూర (శుభ్రంగా కడిగి తరిగినది) - రెండు కట్టలు , చిటికెడు పసుపు, కారం- అర టీ స్పూన్, గరం మసాల- అర టీ స్పూన్ , ఉప్పు రుచికి తగినంత , కొత్తిమీర (అలంకరణకి)- పావుకట్ట, అల్లం వెల్లుల్లి- ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి- రెండు ముక్కలుగా తరిగినది.
తయారీ విధానం:
చేపముక్కలని కడిగి వాటికి పసుపు, అల్లం వెల్లుల్లి, ఉప్పు పట్టించి పెట్టు కోండి. తరువాత చేపముక్కలని ఒక్కొక్కటిగా నూనెలో వేగించి తీసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకుని నెయ్యి వేడిచేసి ఉల్లిముక్కలని సన్నని సెగమీద వేగించండి. ఉల్లిపాయ రంగుమారకుండా చూసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు, పొడి మసాల వేశాక కడిగి, నానబెట్టుకున్న బియ్యం వడకట్టి వేసి రెండు నిమిషాలు ఉడికించండి. దానిలో పాలకూరని కూడా వేసి 450 మిల్లీ లీటర్ల నీటిని పోసి ఉడికించండి. చివరగా చేపముక్కలని వేసి కాసేపు వేడిమీద ఉంచండి. తరువాత తరిగిన కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా వడ్డించండి. ఈ కొలతలతో తయారుచేసిన పాలక్ ఫిష్ కిచిడి ఇద్దరికి సరిపోతుంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







