శివ సీక్వెల్ తీయాలన్న ఆలోచన!
- December 20, 2016
శివ.. తెలుగు సినిమా ట్రెండ్ సెట్టింగ్ సినిమాల్లో అదొకటి.. రాంగోపాల్ వర్మను దర్శకుడిగా తొలిసారి పరిచయం చేసిన సినిమా.. అప్పటివరకూ హీరో అంటే ఉన్న ఇమేజ్ ను చెరిపేసిన సినిమా.. యూత్ ను వెర్రెక్కించి చైన్లు కొనిపించిన సినిమా.. ఈ సినిమాతో అప్పట్లో కాలేజీల్లో హింస పెరిగిందన్న వాదనలూ ఉన్నాయి.
అలాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాను సీక్వెల్ తీయాలన్న ఆలోచన ఇంతవరకూ ఎవరూ చేయలేదు. ఇప్పుడు ఇదే విషయం వర్మ తాజా చిత్రం వంగవీటి ఆడియో ఫంక్షన్లో హాట్ టాపిక్ అయ్యింది. వేదికపై నాగార్జున మాట్లాడుతూ.. ఆ సినిమాను చెడగొట్టగూడదనే శివ సీక్వెల్ తీసే ప్రయత్నం చేయలేదన్నారు.
కానీ రామూ మరోసారి దర్శకత్వం వహిస్తానంటే ఆ అవకాశం రామూకు మాత్రమే ఇస్తానంటూ సంచలన ప్రకటన చేశారు.
నాగార్జున మాటలు చూస్తుంటే శివ సీక్వెల్ తీయాలన్న ఆలోచన బలంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఇందుకు వర్మ కూడా సై అంటే.. తెలుగు తెరపై మరో అద్భుతం ఆవిష్కృతమవుతుందేమో..!
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







