ఇండోనేషియాలో 6.6 తీవ్రతతో భూకంపం..
- December 20, 2016
ఇండోనేషియాలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6 గా నమోదైందని భూకంప అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు. 'మలుకు బరాత్ దయ' ప్రాంతానికి ఈశాన్యంగా 184 కిలోమీటర్ల దూరంలో, భూమిలోపల 173 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.
భూకంప కేంద్రం చాలా లోతులో ఉన్నందున ఇది అంత ప్రమాదకరమైనది కాదని, సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావంతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు గుర్తించలేదని ఇండొనేషియా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రొహొ వెల్లడించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







