తేలియాడుతున్న మంచు గడ్డపై పియానో ప్రదర్శన!
- December 21, 2016
ఇటలీకి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు లుడోవికో ఇనోది, ఆర్కిటిక్ సముద్రంలో ఇచ్చిన ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సంగీత ప్రియులు అతని అద్భుత బాణీలకు మంత్రముగ్ధులైతే.. పర్యావరణవేత్తలను ఈ ప్రదర్శన ఆలోచనలో పడేసింది. ప్రదర్శనలో అంతర్లీనంగా మానవాళికి ముంచుకొస్తున్న ముప్పు గురించి చెప్పాడు ఇనోది. ఆర్కిటిక్ మహాసముద్రంలో తేలియాడుతున్న మంచు గడ్డపై పియానో వాయిస్తూ ఇచ్చిన ప్రదర్శనకు మంచి స్పందన వస్తోంది. ఆర్కిటిక్‌కు స్మృతిగీతం పేరుతో ఈ ప్రదర్శన సాగింది. ఇనోది ప్రత్యేకంగా దీనికోసమే ఈ ట్యూన్‌ను కంపోజ్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్ను గ్రీన్‌పీస్ సంస్థ స్పాన్సర్ చేసింది. ప్రపంచ నేతలూ ఆర్కిటిక్ వైపు ఓసారి చూడంటూ ఈ ప్రదర్శన ద్వారా పిలుపునిచ్చారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఊహించిన దానికన్నా వేగంగా ఆర్కిటిక్ కరిగిపోతోందని, ఇప్పటికైనా మేల్కోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఇచ్చారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







