తలలుతీసిన వీరులు...వ్యవసాయం చేసుకుంటున్నారు!
- December 21, 2016
ఇచ్చిన ననిని మాట్లాడకుండా పూర్తి చేసే జాతి .. ఇంకా చెప్పాలంటే చూస రమ్మంటే క కాల్చి వచ్చే రకపు గిరిజన జాతి చెందిన యుధ్దవీరులు. యుధ్దంలో వెన్ను చూపడం ఎరగని యోధానయోధులు వాళ్ళు..అదంతా ఒకప్పుడు.. కానీ అవ్వన్నీ వదిలేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. నాగాల్యాండ్ లో నివశించే చారిత్రాత్మక కొన్యాక్ గిరిజనజాతి తెగ వానరు.చరిత్రలో ఒకప్పుడు హెడ్ హంటర్స్ గా పేరు పడ్డకొన్యాక్ గిరిజన తెగ జీవన స్థితి గతుల గురించి ఫేమస్ ఫోటో గ్రాఫర్ ఫనిల్ పాండ్యా తన కెమెరాలో బంధించాడు.నార్త్ ఈస్ట్ ఇండియా ప్రాంతం ..నగాల్యాండ్ లో నివశించే కొన్యా్క్ గిరిరజన తెగకు వేట అంటే అమితమైన ఇష్టం..యుద్ధమంటే సరదా పడే సాంప్రదాయపు తెగ..తెగిపడ్డ తలలు,తలలేని మొండాలు..
పగలు ప్రతీకారాలు..ఇదీ కొన్యాక్ గిరిజన తెగ జీవన గత జీవన శైలి ఇటువంటి రక్త చరిత్రను కలిగిన కుటుంబాలను విడనాడి,పగలు పంతాలు,ప్రతీకారాలు తగ్గించుకుని వాళ్ల దృష్టిని వ్యవసాయం వైపు మళ్ళించారు. అంతరించి పోతున్న.కొన్యాక్ తెగ ఉనికిని తన డాక్యుమెంటరీలు,చిత్రాలతో ఫనిల్ పాండ్యా వారి ఉనికిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నాగాల్యాండ్ ఉండే కొన్యాక్ గిరిజన జాతి గ్రామాలను రెండు సార్లు విజిట్ చేసి వందల చిత్రాలు తీశాడు ఫోటో గ్రాఫర్ ఫనిల్ పాండ్యా..ముఖం మీద పొడిచిన పచ్చబొట్లు, జంతువుల కొమ్ములు, చర్మాలు, వెంట్రుకలు వంటికి చుట్టుకోవడం కొన్యాక్ జాతి గిరిజనుల అలవాటు. 1960 ఇప్పటి రోజుల్లో వ్యవసాయం చేస్తూ..అప్పుడప్పుడూ వేట సాగిస్తున్నారు కొన్యాక్ తెగ గిరిజనులు.
వీళ్ళ కు కుల పెద్ద గా వ్యవహరించే రాజుకే వారందరి మీదా అదికారం చెలాయించే అధికరమూ ఉంటుంది. ఈ జాతిలో మహళలకు సముచిత స్థానం తో బాటు వ్యవసాయం,సంస్కృతి, ఇంటిపనులు వ్యవహారాల్లో ప్రాధాన్యత కూడా ఉంటుంది. పూర్తిగా మారిన పరిస్థితుల ప్రభావం కొన్యాక్ గిరజన జీవనశైలి లో, జీవితాల్లో పెనుమార్పులు తెచ్చింది.ఎప్పుడూ కొట్లాటలు,తగాదాలకు పోయే వారి పిల్లలు ఇప్పుడు క్లాసురూంలకు వెళుతున్నారు.పుస్తకాలవైపు దృష్టి సారిస్తున్నారు ఇంకా ఇటుంటి చిత్రాలు చూడాలనుకుంటే ఢిల్లి లోని దిఎగ్ ఆర్ట్ స్టూడియో కి వెళ్లాల్సిందే.అక్కడ2016 డిశెంబర్ 20 నుంచి 2017 జనవరి 20 దాకా ఫలిల్ పాండ్యా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో 1960 దాక హవా సాగించిన నాగాలాండ్ కొన్యన్ యుధ్ద వీరులను చూడొచ్చు.
తాజా వార్తలు
- Abdullah bin Salem opens 58th Watch and Jewellery Middle East Show
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!







