12 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది..
- December 21, 2016
తమిళనాడుకు చెందిన 12 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్నారనే కారణంతో శ్రీలంక నేవీ అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పనీర్‌సెల్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి.. తమిళ జాలర్ల విషయంలో శ్రీలంక నేవీ అనుసరిస్తున్న విధానానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరిన మరుసటి రోజే ఈ అరెస్టులు చోటు చేసుకోవడం గమనార్హం. రామేశ్వరం ఫిషరీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గోపీనాధ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పంబన్ నుంచి మూడు బోట్లలో 20 మంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. నిషేధించిన వలలతో చేపల వేటకు వెళ్లిన వీరిని, శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకోనే సమయంలో ఒక బోట్లో ఎనిమిది మంది అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేశారు. మిగిలిన రెండు బోట్లలోని 12 మందిని శ్రీలంక అధికారులు అదుపులోకి తీసుకొని కంగేసంతురాయ్ పోర్ట్‌కు తరలించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







