శరవేగంగా దోహా మెట్రో పనులు
- December 21, 2016
దోహా మెట్రో ప్రాజెక్ట్ 54 నుంచి 59 శాతం మేర పనులు పూర్తయ్యాయని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. నాఉలగు లేన్లలో పనులు పూర్తవడం గొప్ప విషయమని ఆయన అన్నారు. 2019 చివరి క్వార్టర్‌లో తొలి మెట్రో ట్రైన్ పరుగులు పెట్టడం ఖాయమని ఖతార్ ఇంటిగ్రేటెడ్ రైల్వే ప్రాజెక్ట్ సీనియర్ డైరెక్టర్ మార్కస్ డెమ్మిలెర్ చెప్పారు. ఖతార్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ సమావేశంలో ప్రెజెంటేషన్ ఇచ్చిన సందర్భంలో 13.6 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ స్ట్రెచ్‌లో61.4 శాతం పనులు పూర్తయ్యాయనీ, 8.9 కిలోమీటర్ల సౌత్ ఎలివేటెడ్ రూట్‌లో 66.5 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. లుసైల్ లైట్ రైల్ ట్రాన్సిట్‌కి సంబంధించి 32 కిలోమీటర్ల మేర 35 స్టేషన్లతో రూపొందిస్తున్న ప్రాజెక్ట్ పనులు మాత్రం కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయి. 44.8 శాతం పనులు ఇప్పటిదాకా పూర్తయ్యాయి. లుసైల్ ఎల్‌ఆర్‌టి ఎట్టి పరిస్థితుల్లోనూ 2020 నాటికి అందుబాటులోకి వస్తుంది. 2022 ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభానికి సరిగ్గా రెండేళ్ల ముందు ఈ ప్రాజెక్ట్‌ని అందుబాటులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. సౌదీ అరేబియాతో కనెక్ట్ అయ్యే 486 కిలోమీటర్ల ప్రాజెక్ట్‌ని ఎంతో పట్టుదలతో పూర్తి చేయగలమని కూడా ఖతార్ రైల్ అధికారులు చెప్పారు. ఖతార్ రైల్ అధికారులు, ఖతార్ మెట్రోకి సంబంధించిన పూర్తి వివరాల్ని గణాంకాలతో సహా వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







