30 కిలోల గంజాయిను ఆసియా దేశస్థుల నుంచి స్వాధీనం చేసుకొన్న కస్టమ్స్ శాఖ
- December 21, 2016
కస్టమ్స్ శాఖ సాధారణ అథారిటీ మంగళవారం హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ శాఖకు చెందినఐదుగురు ఉద్యోగులు ఆసియా ప్రయాణికుల నుండి 30 కిలోగ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకొన్నారని ప్రకటించింది.కస్టమ్స్ శాఖ సాధారణ అథారిటీ నుండి ఒక ప్రకటన కస్టమ్స్ ఉద్యోగులు ప్రయాణికులు అనుమానం కల్గించే తీరులో అనేక సంచులను గమనించారు. దీనితో వాటిని తనిఖీ కోసం ఆ బ్యాగులను పరిశీలించగా ,ఒక్కో సంచిలో 3 నుంచి 7 కిలోల గంజాయి కనుగొనబడింది. కార్బన్ కాగితంలో చుట్టి ఉన్న పొట్లాలలో ౩౦ కిలోల గంజాయిని కనుగొన్నారు. ఈ అక్రమ రవాణాదారులు సమర్ధవంతంగా పట్టుకొన్న ఐదుగురు ఉద్యోగుల గౌరవార్థంగా ఒక కార్యక్రమం నిర్వహించారు కస్టమ్స్ జనరల్ అథారిటీ చైర్మన్ అహ్మద్ బిన్ ఆలీ అల్ మొహాన్నది మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉద్యోగుల ప్రయత్నాలు మరియు మాధకద్రవ్యాల నుంచి సమాజం రక్షించే వారి నిజాయతీతో కూడిన గొప్ప పాత్రను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







