'మిక్చర్ పొట్లం' నిర్మాత లయన్ డా.లక్ష్మీ ప్రసాద్ తో మాగల్ఫ్ ముచ్చట్లు
- December 21, 2016
విభిన్న కథాంశాలతో రూపొందే చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. తెలుగు తెరపై కొత్త ప్రయత్నాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు లభిస్తూనే ఉంటాయి. ఆ పెద్ద మనసుతోనే తమ చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు 'మిక్చర్ పొట్లం' నిర్మాత లక్ష్మీ ప్రసాద్. సరదా సరదాగా సాగే చక్కని కథాంశంతో 'మిక్చర్ పొట్లం' సినిమా రూపొందుతోందని, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఈ చిత్రాన్ని నిర్మించామని మాగల్ఫ్ శ్రీకాంత్ తో లక్ష్మీ ప్రసాద్ సినిమా విశేషాల్ని వివరించారు. 'కొత్త బంగారు లోకం' ఫేం శ్వేతా బసు ప్రసాద్ ఈ చిత్రంలో నటిస్తుండడం గొప్ప విషయం. జయంత్, గీతాంజలి, భానుచందర్, సుమన్, పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్, చిట్టిబాబు, అలీ, జూనియర్ రేలంగి, వీరన్న చౌదరి, జబర్‌దస్త్ మురళి, జబర్‌దస్త్ ఫణి తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. మాధవపెద్ది సురేష్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: ఎంవి సతీష్ కుమార్,నిర్మాతలు:లయన్ డా. కలపటపు శ్రీ లక్ష్మీ ప్రసాద్, డా.కంటే వీరన్న చౌదరి, లంకలపల్లి శ్రీనొవాసరావు. గోదావరి సినీ టోన్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







