'భైరవ'..విడుదలకి ముందే ఐట్యూన్స్‌లో ప్రత్యక్షం
- December 21, 2016
తమిళ స్టార్ హీరో విజయ్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'భైరవ'. విజయ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆడియో ఈనెల 23న విడుదల కానుంది. తమిళ పొంగల్‌కు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంతోష్‌నారాయణ్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా విషయంలో తలెత్తిన ఓ పరిణామం అటు అభిమానులనే కాదు చిత్ర బృందాన్ని, ఆడియో కంపెనీని కూడా షాక్ గురిచేసింది. 23న విడుదల కావాల్సిన ఆడియో 20నే ఐట్యూన్స్‌లో ప్రత్యక్షమైంది. రూ.75లకు ఈ ఆల్బమ్‌ను వినియోగదారులకు సంస్థ అందుబాటులో ఉంచింది. విషయం తెలుసుకున్న లహరి మ్యూజిక్ సంస్థ వెంటనే ఐట్యూన్ నిర్వాహకులతో మాట్లాడి స్టోర్ నుంచి ఆల్బమ్‌ను తొలగింపజేసింది.అయితే దాదాపు 20 నిమిషాలు అందుబాటులో ఉండటంతో అప్పటికే కొంతమంది ఈ ఆల్బమ్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారట!
ఈ అంశంపై లహరి మ్యూజిక్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా అభిమానులకు క్షమాపణలు చెప్పింది. కొన్ని సాంకేతిక లోపాల కారణంగా గతంలో తెలిపిన విడుదల తేదీ రోజునే వారు లైవ్‌లో విడుదల చేశారని పేర్కొంది. వాస్తవానికి ఈ సినిమా ఆడియో డిసెంబర్ 20న విడుదల చేయాలని తొలుత భావించారు.
కానీ కొన్ని కారణాల వల్ల 23కు వాయిదా వేశారు. అయితే ఈ సమాచారం ఐట్యూన్స్ తెలియజేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







