ఒమాన్ లోనికి ప్రవేశించే నిర్వాసిత మహిళలకు నూతన వీసా నిబంధనలు
- December 21, 2016
మస్కట్ : కొన్ని దేశాలకు చెందిన మహిళా అవివాహిత జాతీయులను ఇకపై పర్యాటక వీసాలతో ఒమాన్ లోనికి ప్రవేశింపనీయరు. తిరిగి వెళ్లే విమాన టికెట్ ఒకవేళ వారి వద్ద లేకపోతే కనీసం ఒక 4 నక్షత్ర హోటల్ లో బుక్ చేయడానికి అనుమతించబడరని రాయల్ ఒమన్ పోలీస్ తెలిపారు. కొన్ని దేశాలకు చెందిన మహిళా ఆసియా పర్యాటకుల పర్యాటక వీసా మంజూరుని నిరోధిస్తున్నామని పేర్కొంటూ, వారిపై పలు మానవ రవాణా, వ్యభిచారం, మాదకద్రవ్యాలు, దూషణ తదితర నేరాలతో సంబంధం ఆరోపణలు ఉన్నకారణంగా మరింత నియంత్రణలను రాయల్ ఒమన్ పోలీస్ అమలు చేస్తోంది.కొత్త నిబంధనల ప్రకారం వీసా పొడవు గరిష్టంగా తగ్గించబడ్డాయి. పది రోజులు మాత్రమే ఉంటుంది.ఆ దేశాలకు చెందిన జాతీయులు వారు తిరిగి వారి దేశాలకు వెళ్లిన ఒక నెల తర్వాత మరొక పర్యాటక వీసా అనుమతి లేదు.మరో ముఖ్యమైన సూచన ఏమిటంటే , ఒమాని చట్టం ప్రాకారామ్ ఎవరైనా వ్యభిచారం కేసులో దొరికితే కనీసం మూడు నెలల నుంచి మూడేళ్ల జైలుశిక్ష తప్పనిసరిగా అమలుచేయనున్నారు. అంతేకాక 20 ఒమాన్ రియాల్స్ నుంచి మరియు 100 ఒమాన్ రియాల్స్ మధ్య జరిమానాసైతం ఉంటుంది. అదేవిధంగా శిక్ష వేశ్యాగృహాలను నిర్వహించినా లేదా అసాంఘిక కార్యక్రమాలకు సహాయపడిన ఎవరికైనా ఈ శిక్షలు వర్తిస్తాయి. .
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







