గుర్తింపు కార్డు ఉంటేనే వెంకన్న దర్శనం
- December 21, 2016
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ గుర్తింపు కార్డును తప్పనిసరి చేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. భక్తులకు తితిదే అందిస్తున్న సేవల్లో పారదర్శకత పెంచడంతో పాటు, అక్రమాలను అడ్డుకోవడానికి ఇప్పటికే గదుల బుకింగ్, శ్రీవారి అర్జిత సేవలతో పాటు దర్శనం టిక్కెట్లు, అంగప్రదక్షిణం టోకెన్ల జారీ, శ్రీవారి సేవకుల నమోదు కోసం ఆధార్‌కార్డును స్వీకరిస్తున్నారు. తాజాగా ఇదే విధానాన్ని కాలినడక భక్తులకు కూడా అమలు చేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో తిరుమలకు చేరుకునే యాత్రికులకు గాలిగోపురం వద్ద, శ్రీవారిమెట్టు మార్గంలో వచ్చే వారికి 1200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తారు.
ఇకపై భక్తుడి ఫోటోతో పాటు గుర్తింపుకార్డు నంబరును పొందుపరిచి దర్శనం టిక్కెట్లు జారీ చేయనున్నారు. గుర్తింపు కార్డు నంబరు పొందుపరిచిన యాత్రికులకు మాత్రమే లడ్డూ టోకెన్లు, శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వీలవుతుందని.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని భక్తులను తితిదే కోరింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







