ఆదాయం విషయంలో అందరికీ షాక్ ఇచ్చిన హృతిక్ రోషన్..
- December 22, 2016
గత ఏడాది మొహెంజోదారో సినిమాతో భారీ డిజాస్టర్ ను ఎదుర్కొన్న బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ ఆదాయం విషయంలో మాత్రం అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం కాబిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ మ్యాన్లీ స్టార్ 80 కోట్ల రూపాయల అడ్వాన్స్ ట్యాక్స్(ముందస్తు పన్నుల రూపంలో) చెల్లించాడు. సినిమాలతో పాటు యాడ్స్ లో నటించటం, హెచ్ ఆర్ ఎక్స్ ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయానికి గాను ఈ మొత్తాన్ని అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో చెల్లించినట్టు తెలిసింది.
గత ఏడాది 50 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన హృతిక్, ఈ ఏడాది మరో 30 కోట్లు అధికంగా చెల్లించాడు. హృతిక్ తరువాతి స్థానంలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఉన్నాడు.
దంగల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న ఆమిర్ 72 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు. 37 కోట్లను చెల్లించి రణబీర్ కపూర్, 14 కోట్లను కట్టి సల్మాన్ ఖాన్, 10 కోట్లను కట్టి అక్షయ్ కుమార్ లు ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. అయితే బాలీవుడ్ టాప్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖులు ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారనే విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించలేదు.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







