3 నెలల్లో 19000 మంది డ్రైవింగ్ టెస్ట్‌లో పాస్
- December 22, 2016
మనామా: డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ సంఖ్యని పెంచడం, అలాగే ఇ-డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా లెర్నింగ్ రిక్వైర్‌మెంట్స్‌కి సంబంధించిన ప్రాసెసింగ్ కింగ్‌డమ్‌లో చాలా వేగంగా నడుస్తోంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - డైరెక్టర్ ఆఫ్ డ్రైవింగ్ లెర్నింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 35000 మందిలో 19000 మంది గత మూడు నెలల్లో డ్రైవింగ్ టెస్ట్‌ని పాస్ అయినట్లు డైరెక్టర్ చెప్పారు. ఇ-సిస్టమ్ ద్వారా ఇన్‌స్ట్రక్టర్స్ కోసం వెయిటింగ్ పీరియడ్ తగ్గిందని ఆయన వివరించారు. ఒకే భవనంలో సేవల్ని అందించడం, అలాగే కాంప్రహెన్సివ్ ఎంప్లాయీ సిస్టమ్ ఇందుకు దోహదం చేసినట్లు చెప్పారాయన. మిగతా ఇ-సిస్టమ్స్‌కి భిన్నంగా సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ సిస్టమ్ తాలూకు వర్కింగ్ అవర్స్ ఉంటున్నాయని, డిపార్ట్‌మెంట్ ఈ సేవల్ని శనివారం ఉదయం కూడా అందిస్తోందని తెలిపారాయన. ఫిర్యాదులు లేదా సలహాల్ని ఎవరైనా ఇవ్వాలనుకుంటే డిపార్ట్‌మెంట్‌ని ఎవరైనా సంప్రదించవచ్చునని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







