ఈ-మెయిల్ అడ్రస్ ఇక తెలుగులోనే!
- December 22, 2016
న్యూదిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, జయపురకు చెందిన డేటామెయిల్‌తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఎనిమిది భారతీయ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'డిజిటల్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఎనిమిది భారతీయ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ రూపొందించుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.
ఈ మేరకు డేటామెయిల్‌తో ఒప్పందం చేసుకుంది.
'దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చాలన్నది ప్రధాని మోదీ ఆశయం. ఇందులో భాగంగా ఎనిమిది భారతీయ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు రూపొందించుకోవచ్చు. ఇక నుంచి వారు తమ మాతృభాష, ప్రాధాన్యం ఉన్న భాషలో ఈ-మెయిల్ అడ్రస్‌ను సృష్టించుకోవచ్చు' అని బీఎస్‌ఎన్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ ఓ ప్రకటనలో తెలిపారు.
మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ-మెయిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు ఆండ్రాయిడ్, ఐవోఎస్ స్టోర్లలో డేటా మెయిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈ సదుపాయాన్ని పొందవచ్చు. హిందీ, గుజరాతీ, ఉర్దూ, పంజాబీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ రూపొందించుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్ (వినియోగదారుల సేవలు)ఎన్‌కే గుప్తా తెలిపారు.
తాజా వార్తలు
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!
- ఖతార్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ వీక్ 2026..!!
- బహ్రెయిన్‌లో అక్టోబర్ 9న ‘ట్రిబ్యూట్ టు బహ్రెయిన్’..!!
- కువైట్‌లో 77 సంస్థలకు ఫైర్ సేఫ్టీ హెచ్చరికలు..!!
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు







