500 మిలియన్ల దిర్హామ్స్ విలువగల మాదక ద్రవ్యాలను పట్టుకున్న దుబాయ్ కస్టమ్స్
- September 06, 2015
దుబాయ్, జెబెల్ అలీ ఏర్ పోర్టులో 140 పెట్టెలలో దాచిన 35 మిలియన్ల ట్రమడోల్ మాత్రలను, 100 బారళ్ల లోపల సంచులలో ఉన్న 2.5 టన్నుల ట్రమడోల్ పొడిని యూ. ఏ. ఈ. నుండి ఒక ఏషియా దేశానికి తరలించే యత్నాన్ని దుబాయ్ కస్టమ్స్ శాఖ వారు భగ్నం చేశారు. వీటి విలువ 500 మిలియన్ల దిర్హామ్స్ ఉంటుందని తెలియవచ్చింది. సంబంధిత దిగుమతుల కంపెనీ ఏజెంటును, తదుపరి విచారణ కొరకు దుబాయి పోలీసు వారికి అప్పగించారు. ధృవపత్రాల ప్రకారం, ఆ సరుకులో వైద్య సంబంధ ఉత్పత్తులు, సామగ్రి ఉన్నాయని తెలుపబడింది. దిగుమతిదారు గతంలో కూడా, దుబాయి కార్గో విలేజ్ ద్వారా ట్రమడోల్ ను తరలించడానికి ప్రయత్నించారని, వారి నేరచరిత్ర ప్రకారం అనుమానించి సోదా జరిపినపుడు ఈ నిషేధిత పదార్ధాలు పట్టుబడ్దాయని కస్టమ్స్ ఇంటలిజెన్స్ డిపార్ట్‌మెంట్ డైరక్టర్ - తలాల్ అల్ అబ్దూలి వివరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







