ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల్లో 12 పార్టీలు రద్దు
- December 23, 2016
ఎన్నికలకు దూరంగా ఉన్న నమోదిత రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కొరడా ఝుళిపించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 12 రాజకీయ పార్టీల నమోదును రద్దు చేసింది. 2005 సంవత్సరం నుంచి జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలను గుర్తించాలని ఎన్నికల సంఘం భావించి కసరత్తు చేసింది. ఆయా పార్టీల నమోదు సందర్భంగా పేర్కొన్న చిరునామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ పేర్కొంది.
ఈసీ రద్దు చేసిన రాజకీయ పార్టీలు
* ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ
* అన్న తెలుగుదేశం పార్టీ
* ఆంధ్రనాడు పార్టీ
* జై తెలంగాణ పార్టీ
* తెలంగాణ ప్రజా పార్టీ
* తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
* ముదిరాజ్ రాష్ట్రీయ సమితి
* నేషనల్ సిటిజన్ పార్టీ
* సత్యయుగ్ పార్టీ
* భారతీయ సేవాదళ్
* ఆల్ ఇండియా సద్దుగణ పార్టీ
* బహుజన రిపబ్లికన్ పార్టీ
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







