ఆర్య సందనదేవన్ గా..
- December 23, 2016
నటుడు ఆర్య 1980 కాల యువకుడిగా మారడానికి కసరత్తులు చేస్తున్నారు. ఇంతకు ముందు 1947కు ముందు తెల్లదొర పాలనలో భారతీయ యువకుడిగా మదరాసు పట్టణం చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా కంబన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇదీ పిరియడ్ కథా చిత్రమే అని సమాచారం. దీని తరువాత అమీర్ దర్శకత్వంలో సందనదేవన్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. జయంరవి హీరోగా ఆదిభగవాన్ చిత్రం తరువాత దర్శకుడు అమీర్ మరో చిత్రం చేయలేదు. మధ్యలో ఆయన హీరోగా పేరన్భు కొండ పెరియోర్‌గళే చిత్రం మొదలెట్టారు. అయితే అది ఫైనాన్సియల్ సమస్య కారణంగా ఆగిపోయింది. ఆ తరువాత శింబు కథానాయకుడిగా చిత్రం చేయనున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి.
అదీ వార్తలకే పరిమితమైంది.ఇప్పుడు ఆర్య హీరోగా చిత్రం చేయడానికి అమీర్ సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం.
ఇందులో ఆర్య 1980 నాటి మధురై యువకుడిగా నటించనున్నారట.ఆ కాలంలోని ఒక క్రీడాయోధుడిగా ఆర్య నటించనున్నారట.అందు కోసం ఆర్య తన శారీరక భాషను మలచుకోవడానికి కసరత్తులు చేస్తున్నారట. ఇందులో ఆయనకు జంటగా ఐశ్వర్యారాజేశ్ ఇప్పటికే ఎంపికయ్యారు. మరో నాయకిగా పట్టాదారి చిత్రం ఫేమ్ అతిథిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆర్య కదంబన్ చిత్రాన్ని పూర్తి చేసి అమీర్ దర్శకత్వంలో సందనదేవన్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని తెలిసింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







