జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు..
- December 23, 2016
ఇంట్లోనే చాలామంది తల వెంట్రుకలకు రంగు (హెయిర్‌డై) వేసుకుంటున్నారు. కానీ సరైన జాగ్రత్తలు పాటించకపోతే అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. రంగు వేసుకునేటప్పుడు జుట్టుకు హాని జరగకుండా ఆరోగ్యంగా ఉండే హెయిర్‌ప్యాక్ వేసుకుంటే మంచిది. రసాయనాలు లేని షాంపూలు ఎంచుకోవాలి. ముఖ్యంగా సల్ఫేట్ లేకుండా చూసుకోవాలి. సల్ఫేట్ వల్ల రంగు త్వరగా పోతుంది. అలాగే తరచూ తలస్నానం చేయడం కూడా సరికాదు. వారంలో రెండుసార్లకు మించి తలంటుకోకపోవడం మేలు.
ప్రొటీన్లు అధికంగా ఉండే కండిషనర్లనే ఎంచుకోవాలి. ఇవి రంగు కోల్పోకుండా చూడటమే కాదు. జుట్టుకు బలన్నిస్తాయి. మృదువుగా మారుస్తాయి. కృత్రిమ రంగుల్ని వాడుతున్నప్పుడు డ్రయర్‌కు ఎంతదూరంగా ఉంటే అంత ఉత్తమం. తలస్నానం చేయడానికి ముందు తప్పనిసరిగా కొబ్బరినూనె రాసుకోవాలి. ఇది జుట్టుకు రంగు పట్టి ఉండేలా తోడ్పడుతుంది. జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు.
ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్, లేదంటే నూనె రాసుకొని తర్వాత డై వేసుకోవాలి. జుట్టు మంచి స్మెల్ రావాలంటే హెయిర్ సీరమ్, లేదంటే హెయిర్ స్ప్రేలు వాడాలి. అయితే ఈ సీరమ్స్, స్ప్రేలు మాడుకు, జుట్టు కుదుళ్లకు తగలకుండా జాగ్రత్తపడాలి. లేదంటే వీటిలో ఉండే గాఢ రసాయనాలు వెంట్రుక కుదురును దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి.
తాజా వార్తలు
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!







