హ్యపీ న్యూ ఇయర్ సాంగ్ టీజర్..

- December 23, 2016 , by Maagulf
హ్యపీ న్యూ ఇయర్ సాంగ్ టీజర్..

కాదలుమ్ కడందుపోగుమ్, సేతుపతి, ధర్మదురై, రెక్క అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ సేతుపతి, సీనియర్ నటుడు టి. రాజేందర్ తో కలిసి నటిస్తోన్న తాజా చిత్రం కవన్ కి సంబంధించి రీసెంట్ గా టీజర్ విడుదలైంది. ధనుష్ చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. హ్యపీ న్యూ ఇయర్ అంటూ సాగే ఈ పాటకు హిప్ హాప్ తమీజా సంగీతం అందించగా, అరుణ్ రాజ్ కామరాజు లిరిక్స్ అందించాడు. టి. రాజేందర్ పాడిన ఈ పాట సినిమాకు చాలా ప్లస్ అవుతుందని యూనిట్ భావిస్తోంది. కవన్ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన మడోన్నా సెబాస్టియన్ కథానాయికగా నటిస్తోంది. కేవీ.ఆనంద్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రాంత్, పాండియరాజన్, నాజర్, బోస్‌వెంకట్, జగన్ లు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

మరి తాజాగా విడుదలైన ఆ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com