జనవరి 4న విజయవాడలో `ఖైదీనంబర్ 150` ప్రీ రిలీజ్
- December 24, 2016
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `ఖైదీనంబర్ 150` సంక్రాంతి కానుకగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్లు, మేకింగ్ వీడియో సహా `అమ్మడు లెట్స్ డు కుమ్ముడు` ఆడియో సాంగ్‌కి ప్రేక్షకాభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జనవరి 4న విజయవాడలో `ఖైదీనంబర్ 150` ప్రీరిలీజ్ ఫంక్షన్ అభిమానులు, సినీప్రముఖుల మధ్య గ్రాండ్‌గా జరగనుంది. ఈ విషయాన్ని చిత్రనిర్మాత మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అధికారికంగా ప్రకటించారు. 2017 మోస్ట్ ఎవైటింగ్ మూవీ `ఖైదీనంబర్ 150` కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించబోతున్న సందర్భంగా చిత్రనిర్మాత చరణ్ ప్రేక్షకాభిమానులకు క్రిస్మస్, కొత్తసంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నేటి(శనివారం) సాయంత్రం `ఖైదీనంబర్ 150` నుంచి `సుందరి..` సాంగ్ లాంచ్ అయిన సంగతి విదితమే.
కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తున్నారు. రత్నవేలు ఛాయాగ్రహణం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్ పాత్రలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!
- యూఏఈ లాటరీ డ్రా ఫలితాలు.. ముగ్గురికి చెరో Dh50,000..!!
- థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!
- కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!
- వీల్‌చైర్ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్







