నానబెట్టిన బాదం పప్పుల్ని తింటే..
- December 24, 2016
బాదం పప్పుల్ని అలాగే తీసుకునే కంటే రాత్రి పూట నానబెట్టి ఉదయం పూట తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చివాటితో పోలిస్తే నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల వృద్ధాప్యఛాయలు తగ్గుతాయని వారు సూచిస్తున్నారు.
బాదంలో పీచు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం ద్వారా.. వాటిని నానబెట్టి తీసుకుంటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. మోనోశాచురేటెడ్ కొవ్వే ఇందుకు కారణం. బరువు తగ్గాలనుకునేవారికి మంచి పోషకాహారమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇక.. నానబెట్టిన బాదం తినేముందు తప్పకుండా వాటి పొట్టు తీయాలి. ఉదయం పూట ఇవి తింటే గనుక బాదంలోని ఎంజైములు జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి. జీర్ణవ్యవస్థ పని తీరును వృద్ధిచేసి ఉదర సంబంధిత సమస్యలు బాధించవు. రక్తపోటు అధికంగా ఉన్నవారు కూడా నానబెట్టిన బాదం పప్పుల్ని తీసుకోవచ్చు.
ఇందులోని పోషకాలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువుకు ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా అందుతుంది. బిడ్డ ఎదుగుదలలో లోపాలు తలెత్తవు. తల్లీబిడ్డలకు ఇది మేలు చేస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ జబీల్ పార్క్‌లో ‘వికసిత్ భారత్ రన్ 2026’.. 1,500 మందికి పైగా పాల్గొనడం
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!
- యూఏఈ లాటరీ డ్రా ఫలితాలు.. ముగ్గురికి చెరో Dh50,000..!!
- థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!
- కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!
- వీల్‌చైర్ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం







