బర్వాన్ కీరా కర్రీ
- December 24, 2016
కావలసిన పదార్థాలు: కీరా దోసకాయ - అరకేజి, పనీర్ 60 గ్రా., వెన్న - 10 గ్రా., జీడిపప్పు - 50గ్రా., పచ్చిమిర్చి - 5 గ్రా., టమేటో గుజ్జు - 25 గ్రా., ఉల్లిపాయ గుజ్జు - 75 గ్రా., అల్లం పేస్టు - 25 గ్రా., వెల్లుల్లి పేస్టు - 12గ్రా., గరం మసాలా పొడి - 6గ్రా., కొత్తిమీర - 1 కట్ట, ఎండుమెంతి - 4 గ్రా., క్రీమ్ - 100 గ్రా., ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ఒక వెడల్పాటి గిన్నెలో తరిగిన పనీర్, పచ్చిమిర్చి, సగం జీడిపప్పు, కొద్దిగా కొత్తిమీర, మసాలపొడి వేసి బాగా కలుపుకోవాలి. కీరాను తొక్కతీసి అంగుళం మేర గుండ్రటి చక్రాల్లా తరిగి లోపలి గింజల్ని తీసేసి అందులో పనీర్ మిశ్రమాన్ని కూరాలి. కడాయిలో వెన్న వేడి చేసి, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, టమేటో పేస్టులను వేసి వేగించాలి. తర్వాత మిగిలిన జీడిపప్పు, మసాలపొడి, ఎండుమెంతి, ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉంచాక పనీర్ కూరిన కీరాముక్కల్ని వేసి నిమిషం తర్వాత దించేసి క్రీమ్, కొత్తిమీరలతో అలంకరించాలి. ఇది పుల్కాలతో గానీ అన్నంతో గానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- యూపీలో భారీ వర్షాలు ..17 మంది మృతి
- దుబాయ్ జబీల్ పార్క్‌లో ‘వికసిత్ భారత్ రన్ 2026’.. 1,500 మందికి పైగా పాల్గొనడం
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!
- యూఏఈ లాటరీ డ్రా ఫలితాలు.. ముగ్గురికి చెరో Dh50,000..!!
- థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!
- కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!
- వీల్‌చైర్ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!







