"శివం" గా వస్తున్న కందిరీగ
- September 07, 2015
రామ్ కథానాయకుడిగా నటిస్తున్నతాజా చిత్రం శివమ్. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ నిర్మిస్తున్నారు.శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాశిఖన్నా కథానాయిక. ఇటీవలే నార్వే, స్వీడన్‌లో పాటల చిత్రీకరణ పూర్తిచేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ చిత్రంలోని రెండు పాటల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నార్వేలోని అట్లాంటిక్ సముద్రం రోడ్డులో ఓ పాటని, ఈ పాటలోని కొంత భాగాన్ని ఓస్లోలో చిత్రీకరించాం. అలాగే రామ్, రాశిఖన్నా పాల్గొనగా నార్వేలోని కరేంగేర్, ట్రాల్ స్టిజన్, డాల్స్ నిబ్బా, స్టాల్‌హేమ్ వంటి అందమైన ప్రదేశాల్లో షూట్ చేయడం జరిగింది. నార్వేలోని ఈ ప్రదేశాల్లో ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా చిత్రీకరణ జరుపుకోలేదు. గుండె ఆగిపోతోందే.. అంటూ సాగే పాటను స్వీడన్‌లోని ఓల్డ్ టౌన్ అయినటువంటి గామ్లా స్టాన్‌లో చిత్రీకరించాం. రామ్, రాశిఖన్నాలపై చిత్రీకరించిన ఈ మూడు పాటలకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. ఇంకా మూడు పాటలు చిత్రీకరించాల్సి వుంది. వాటిని ఈ వారం నుంచి హైదరాబాద్‌లో పూర్తి చేస్తాం. ఈ నెల 12న పాటల్ని, అక్టోబర్ 2న చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఇదొక హై ఓల్టేజ్ లవ్‌స్టోరీ. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్ని అంశాలు సమపాళ్లలో మేళవించిన చిత్రమిది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రామ్ పాత్ర పవర్‌ఫుల్‌గా వుంటుంది. కథలోని మలుపులు ఆసక్తికరంగా వుంటాయి అన్నారు. బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్, ఫైట్స్: పీటర్‌హెయిన్స్, సంగీతం: దేవీశ్రీప్రసాద్. బాహుబలి చిత్రంలో అవంతిక పాత్రలో చక్కటి అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది తమన్నా. ఆమె కథానాయికగా నటిస్తోన్న తాజా చిత్రం బెంగాల్‌టైగర్. రవితేజ కథానా.. మయూరి ఓ సాధారణ యువతి. మనసుకు నచ్చిన ఉద్యోగం, ప్రాణంగా ప్రేమించే పాపతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతున్న ఆమె జీవన ప్రయాణంలో అనుకోకుండా కొ.. భాస్కరుడికి బ్రాండ్ అంబాసిడర్ ఆ కుర్రాడు. అంతులేని పవర్‌కు ప్రతిరూపమే అతను. సూర్యుడి శక్తినే తన గుప్పెట్లో పెట్టుకున్న అతను ఓ లక్ష్యం కోసం ఎలాంటి పో.. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ తారలకు, అభిమానులకు మధ్య వారధులుగా పనిచేస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా తమ సినిమావిశేషాలతో పాటు వ్యక్తిగత జీవితా.. మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం డైనమైట్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత ఆయన అడ్డా ఫేమ్ జి. కార్తీక్‌రెడ్డి దర్శకత్వంల.. అఖిల్ కార్తీక్, ప్రియవశిష్ట జంటగా నటిస్తున్న చిత్రం స్విమ్మింగ్‌పూల్. శ్రీశ్రీమూవీ క్రియేషన్స్ పతాకంపై అరుణ్‌కుమార్ ముప్పన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్.. తేజ దర్శకత్వం వహించిన చిత్రం, జయం, ధైర్యం, నిజం చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయడం చాలా మంది రిస్క్ అని చెబుతుంటారు. అయితే నాకు అలాంటి భా.. ఓ తండ్రి పడిన ఆవేదన, ఆనందాన్ని మరో వ్యక్తి అనుభూతిలోకి రావడం అన్న ప్రక్రియ నేపథ్యంలో రూపొందించిన లఘు చిత్రం సంయుక్తం అన్నారు విశ్వక్ ఖండేరావు. ఆయన ర.. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం నిర్మల కాన్వెంట్. శ్రేయా శర్మ కథానాయిక. హీరో నాగార్జున నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్ట.. తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయికగా భాసిల్లిన సుందరి నయనతార. ప్రస్తుతం తమిళ చిత్రాలకు మాత్రమే పరిమితమై తెలుగు సినిమాలకు దూరంగా వుంటోంది. శింబుతో .. ఇటీవలే శ్రీమంతుడు చిత్రం ద్వారా తెలుగులో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న శృతిహాసన్ తాజాగా తమిళంలో ఓ భారీ చిత్రంలో అవకాశాన్ని పొందింది. వివరాల్లోకి .. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలు. స్వీయనిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ .. ఐతే అష్టాచమ్మా అలా మొదలైంది గోల్కొండ హైస్కూల్ అంతకుముందు ఆ తర్వాత చిత్రాల ద్వారా సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు క.. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జగన్మాత. శ్రీసాయి సీతారామ ప్రొడక్షన్స్ పతాకంపై జక్కంశెట్టి వెంకటేశ్వరరావు, ఎన్.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మి.. చక్కగా కనిపించాలంటే చిక్కిపోవడానికి మించిన మార్గం లేదంటున్నారు మన కథానాయికలు. అవకాశాల రేసులో ముందుంటాలంటే బక్కపల్చగా కనిపించడమే శ్రేయస్కరం అని భావిస.. భీమవరం టాకీస్ సంస్థ తెరకెక్కిస్తున్న చిత్రం ఎఫైర్. ప్రశాంతి, గీతాంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీరాజన్ దర్శకుడు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ .. ధన్‌రాజ్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, హేమత్, గీతాంజలి, ఆర్తిపురి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం అద్దంలో దెయ్యం. రమేష్ నూతలపాటి దర్శకుడు. సత్యనారాయణ..
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









