జనవరి 29న జరగనున్న సమంత చైతూల ఎంగేజ్ మెంట్..!

- December 25, 2016 , by Maagulf
జనవరి 29న జరగనున్న సమంత చైతూల ఎంగేజ్ మెంట్..!

ఈ డిసెంబర్ లో జరిగిన అక్కినేని అఖిల్ శ్రియ భూపాల్ ల ఎంగేజ్ మెంట్ వార్తల హడావిడి పూర్తి అయిన వెంటనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా మరో వేడుకకు అక్కినేని కాంపౌండ్ రంగం సిద్ధం చేస్తోంది. 'తమ్ముడు తరువాతే నేను' అని నాగచైతన్య ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను అక్షరాల నిజం చేస్తూ తన ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కు డేట్ ఫిక్స్ చేసాడు. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చైతూ-సమంతల ఎంగేజ్ మెంట్ కు డేట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయ వ్ర్గాలం సమాచారం మేరకు వచ్చే నెలలోనే చైతూ, సమంత నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది. 2017 జనవరి 29 వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారని మీడియా వర్గాల సమాచారం.

ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేయాలి అన్న విషయమై నాగార్జున చైతూ సమంతలతో చర్చిస్తున్నట్లు టాక్. భాగ్యనగరంలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్ లో ఈ కార్యక్రమాన్ని అఖిల్ ఎంగేజ్ మెంట్ నిర్వహించిన తీరులోనే అతి తక్కువ అతిధుల మధ్య ఈ ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా నాగచైతన్య సమంతల మ్యారేజ్ కూడ అఖిల్ పెళ్ళిలాగే ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలోనే జరగనున్నట్టుగా తెలుస్తోంది. అఖిల్ పెళ్ళి ఇటలీలో జరుగుతుంటే నాగచైతన్య సమంతల పెళ్ళికి యూరప్ లోని ఒక విహార యాత్ర స్థలాన్ని ఎంపిక చేసినట్లు టాక్. అయితే అఖిల్ పెళ్ళి తరువాత హైదరాబాద్ లో ఇచ్చే గ్రాండ్ డిన్నర్ మాదిరిగా నాగచైతన్య సమంతలు కూడ తమ పెళ్ళి తరువాత ఒక గ్రాండ్ డిన్నర్ ఇవ్వడానికి నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా అన్నదమ్ముల ఎంగేజ్ మెంట్ ఫంక్షన్స్ వెంట వెంటనే జరుగుతూ ఉండటంతో అక్కినేని అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com