అణు బాంబు వేస్తాం: పాక్
- December 25, 2016
పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ తప్పులో కాలేశారు. పాకిస్తాన్ పై అణుదాడి చేస్తామని ఇజ్రాయెల్ పేర్కొన్నట్లు వచ్చిన పుకార్లను నమ్మిన ఆయన పాకిస్తాన్ ఇజ్రాయెల్ పై అణుబాంబుల వర్షం కురిపిస్తుందని అన్నారు. సిరియాలో పాకిస్తాన్ సేనలను మొహరిస్తే అందుకు ప్రతిగా అణుదాడి చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నట్లు పుకార్లు వచ్చాయి.
వాటిని నమ్మిన ఆసిఫ్.. ఇజ్రాయెల్ ఒక్కటే అణు శక్తి కలిగిన దేశం కాదని పాకిస్తాన్ కూడా అణుశక్తి కలిగిన రాజ్యమేనని తన ట్విట్టర్ హ్యాండిల్లో పేర్కొన్నారు. awdnews.com అనే వెబ్ సైట్లో ఇజ్రాయెల్ పాకిస్తాన్ పై అణుదాడి చేస్తోందని ఆ దేశ మాజీ రక్షణ శాఖ మంత్రి మొషే యాలన్ అన్నట్లు వార్త వచ్చింది.వీటిపై స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఆ వార్త సత్యదూరమని పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్ లో ఆసిఫ్ కు రీట్వీట్ కూడా చేసింది. యాలన్ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని పేర్కొంది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







