రూ.999కే గో ఎయిర్ విమాన టికెట్
- December 25, 2016
దేశీయ విమానయాన సంస్థ గో ఎయిర్ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.999కే విమాన టికెట్‌ను ప్రయాణీకులకు అందించనుంది. 2016 ముగింపు సందర్భంగా ఇప్పటికే పలు విమానయాన సంస్థలు ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా గో ఎయిర్ ప్రకటించిన ఆఫర్ ప్రకారం జనవరి 9 2017, ఏప్రిల్ 15, 2017 మధ్య ప్రయాణించే వారు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అయితే ఎన్ని సీట్లు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయో మాత్రం సంస్థ చెప్పలేదు. .
మరోపక్క ఇండిగో సైతం రూ.999కే విమాన టికెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే కేవలం ఈ ఆఫర్ డిసెంబర్ 25 వరకు అదీ హైదరాబాద్-బెంగళూరు రూట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. జయపుర-పుణె మధ్య రూ.2,317.. దిల్లీ-గువహటి మధ్య రూ.2,534.. దిల్లీ-గోవా మధ్య రూ.3,116లుగా టికెట్ ధరలను నిర్ణయించారు.
ఎయిర్ ఏషియా సైతం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రూ.917కే టికెట్‌ను పొందవచ్చు. మార్చి 1, 2017, నుంచి అక్టోబర్ 31, 2017 మధ్య ప్రయాణించే వారికి ఇది వర్తిస్తుంది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







