220 మంది భారత మత్స్యకారులను విడిచిపెట్టిన పాకిస్తాన్

- December 25, 2016 , by Maagulf
220 మంది భారత మత్స్యకారులను విడిచిపెట్టిన పాకిస్తాన్

పాక్ జైళ్లలో ఉన్న 220 మంది భారత మత్స్యకారులను ఆ దేశం ఆదివారంనాడు విడిచిపెట్టింది. పరస్పర సౌహార్ద్ర చర్యల్లో భాగంగా వీరిని ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల కాలంలో సరిహద్దుల్లో ఉగ్ర ఘటనలు, చొరబాట్లతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో భారత మత్స్యకారుల విడుదల ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో ప్రవేశించారన్న ఆరోపణలతో అరెస్టు చేసిన 220 మంది మత్స్యకారులను కరాచీలోని మలిర్ జైలు నుంచి విడుదల చేసి లాహోర్‌కు రైలులో తీసుకువెళ్లారు. అక్కడ వాగా సరిహద్దుల్లో భారత అధికారులకు వారిని అప్పగించినట్టు మలిర్ జైలు సూపరింటెండెంట్ హసన్ సెహ్టో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com