అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంకు గిన్నిస్ బుక్‌ఆఫ్ రికార్డు
- December 25, 2016
సిలికానాంధ్ర, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం గిన్నిస్ బుక్‌ఆఫ్ రికార్డుకెక్కింది. ఈ సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కూచిపూడి నృత్యానికి పుట్టినిల్లయిన 'కూచిపూడి' గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని కళాకారులు ముందుకెళ్లాలన్నారు. కూచిపూడి నృత్యప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకెక్కడం గర్వకారణమన్నారు. ప్రపంచంలో అత్యున్నతమైన నాట్యాల్లో కూచిపూడి ఒకటిగా నిలుస్తుందన్నారు. కూచిపూడి నృత్యానికి గతంలో రూ.100కోట్లు కేటాయించినట్లు చెప్పారు.ప్రతి ఇంట్లో ఒక కంప్యూటర్‌తో పాటు కూచిపూడి నృత్యం నేర్చుకున్న కళాకారులు ఉండాలని, అందుకు తగిన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు కూచిపూడి నృత్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. సిద్దేంధ్రయోగి హైస్కూల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.
రూ.12వేల గౌరవ వేతనంతో అన్ని పాఠశాలల్లో నాట్య గురువులను నియమించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయడు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, నారా లోకేశ్, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..







