గడువు తీరిన ఆహార కుంభకోణంలో ఒమన్ సంస్థ యజమానికి 6 నెలల జైలుశిక్ష..
- December 26, 2016
మస్కట్ : ' పెట్టేవాడికి...తినేవాడు చులకన అన్నట్లుగా ' పాడైన పదార్ధాలను శుభ్రపరచి మళ్ళీ అందమైన ప్యాకెట్లలో ఆర్నెల్ల ఆహరం పంపిణి చేస్తూ జోరుగా వ్యాపారం చేస్తున్న ఒక ఆహార పంపిణి వ్యాపార సంస్థపై అధికారులు కొరడా జుళిపించారు. అంతటితో ఆపక అసలు మూల విరాట్టుకే శిక్ష విధించారు. ఒమాన్ లోని ప్రసిద్ధ హోటళ్లలో మరియు షాపింగ్ మాల్స్ నందు గడువు తీరిన ఆహారపదార్ధాలు అమ్మకం జరుగుతుందన్నవిషయం కనుగొన్న తర్వాత ఒక క్యాటరింగ్ సంస్థ మూసివేయబడిందని వినియోగదారుల పరిరక్షణ ప్రజా సంస్థ నివేదించింది. మానవ వినియోగంకు పనికిరాని నెలల క్రితం పాడైన కాలవ్యవధి దాటిపోయినా ఆహారాన్ని పంపినే చేస్తున్నట్లు ఆ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
బౌషెర్ కంపెనీ ఆహార పదార్ధాలు నిల్వ ఉంచే స్థలంలో ఆకస్మిక తనిఖీలు జరిపిన పి ఎ సి పి అధికారులు ప్రవాసీయుల వద్ద "పెద్ద సంఖ్యలో" కుళ్ళిన చేపలు, మాంసం, నూనె మరియు జున్నుతో సహా 4,000 రకాల గడువు తీరిన ఆయా ఉత్పత్తులను తిరిగి వాడుకలో తీసుకువస్తూ వ్యాపారం చేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ తనిఖీలో సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం లోపల ఒక ఆఫీసు ఉండగా పాత తేదీలు తొలగించి వాటి స్థానంలో కొత్త నకిలీ తేదీలు అతికిస్తూ ఆయా వస్తువులపై ఉపయోగిస్తూ ఒక పరికరంను అధికారులచే కనుగొనబడింది. సుల్తనత్ పరిధిలో ప్రముఖ హోటళ్లు మరియు దుకాణాలకు ముందుగా సిద్ధం చేసిన రెడీమేడ్ భోజనం అందించటానికి ఈ పాడైన ఆహార పదార్ధాలను బౌషెర్ కంపెనీ ఉపయోగించిందని పి ఎ సి పి అధికారులు పేర్కొన్నారు. సంస్థ యజమానికి ఆరు నెలల కారాగార శిక్షతో పాటు 20,000 ఒమాన్ రియాళ్ళు జరిమానా విధిస్తూమరియు గడువు తీరిన ఉత్పత్తులను నాశనం చేయాలని ప్రాధమిక కోర్టు ఆదేశించింది .
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







