ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం..
- December 26, 2016
పేద ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా పలు రకాల వైద్య సేవలు అందించాలన్న దృక్పథంతో ఈనెల 27 ఉదయం 9 గంటలకు తుళ్లూరులోని శ్రీ రావెల వెంకట సుబ్బారావు మరియు నాగ శేషగిరిరావు జూనియర్, డిగ్రీ కళాశాలలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (AP NRT) నిర్ణయించింది. పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మందులు పంపిణీ చేయనున్నారు. అంతేగాక ఈ మెగా హెల్త్ క్యాంపులో వైద్య సేవలు అందించేందుకు గుంటూరు, విజయవాడ నుంచే కాకుండా అబ్రాడ్ నుండి నిపుణులైన వైద్య బృందం రానుందని పేర్కొంది. తుళ్లూరు మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఏపీ ఎన్ ఆర్ టీ కోరింది.
ఏపీ ఎన్ఆర్టీ నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగూస్ అధ్యక్షుడు డాక్టర్ రవి కుమార్ వేమూరు, తాడికొండ ఎమ్మెల్యే టి.శ్రవణ్ కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఏపీ విద్యావిధాన పరిషత్ కమిషనర్ డా. దుర్గాప్రసాద్ లు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- Abdullah bin Salem opens 58th Watch and Jewellery Middle East Show
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!







