మున్సిపల్ కౌన్సిల్ పోల్స్‌లో 202 మంది అభ్యర్థుల ఎంపిక
- December 26, 2016
202 మంది అభ్యర్థుల్ని ఒమన్ మునిసిపల్ కౌన్సిల్స్ ఎన్నికల్లో ఓటర్లు ఎన్నుకున్నారు. 22 మంది మహిళా అభ్యర్థుల్లో ఏడుగురికి అవకాశం దక్కింది. నార్త్ అల్ బతినాలో ఇద్దరు, అల్ బురౌమిలో ఇద్దరు, మస్కట్‌లో ఇద్దరు, సౌత్ అల్ బతినాలో ఒకరు ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఓటింగ్ జరిగినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రెటరీ, మున్సిపల్ కౌన్సిల్ 2వ టెర్మ్ ఎలక్షన్ మెయిన్ కమిటీ హెడ్ ఖాలిద్ బిన్ హిలాల్ అల్ బుసైది చెప్పారు. ఒక్క నిమిషంలోనే ఓటు వేసే ప్రక్రియ పూర్తయినట్లు అలి అల్ లువాటి అనే ఓటరు చెప్పారు. అర్థరాత్రికి ముందే రిజల్ట్‌ని ప్రకటించడం బాగుందని ఆయన వివరించారు. బ్యాలెట్ కోసం సరికొత్త సాంకేతికతను వినియోగించడం జరిగిందని అల్ బుసైది చెప్పారు. అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇ-వోటింగ్ బాక్స్‌లు. రియల్ టైమ్ కౌంటింగ్ ఈ ఎన్నికల ప్రక్రియలో కీలకం. ఎక్కువమంది ఎన్నికల్లో పాల్గొనేందుకు హోమ్‌టౌన్స్‌లో ఉండటం కారణంగా మస్కట్ రోడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.
తాజా వార్తలు
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!







