17 ఏళ్ళ పర్యావరణ ప్రేమికుడి ప్రయాణం
- December 26, 2016
17 ఏళ్ళ అహ్మద్ ఖాన్, క్లీన్ అప్ బహ్రెయిన్ అనే క్యాంప్‌ని చేపట్టాడు. సెయింట్ క్రిస్టోఫర్ స్కూల్ విద్యార్థి అయిన అహ్మద్ ఖాన్, పర్యావరణ ప్రేమికుడు. కాలుష్యం కారణంగా తలెత్తే అనేక సమస్యలకు చెక్ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలంటాడు. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలను భాగస్వామిగా చేసుకుని క్లీన్ అప్ బహ్రెయిన్ అనే క్యాంపెయిన్ చేపట్టాలనుకున్నాడు. అహ్మద్ ఖాన్ ఆలోచనలకు ఊతమిచ్చేందుకోసం నాలుగు సంస్థలు ఇప్పటికే ముందుకు వచ్చాయి. చెత్త, అపరిశుభ్ర వాతావరణమే కాలుష్యానికి ప్రధాన కారణమని అహ్మద్‌ఖాన్ చెబుతున్నాడు. ముఖ్యంగా యువత పరిశుభ్రతపై అవగాహనతో ఉండాలనీ, వివిధ దేశాల నుంచి బహ్రెయిన్‌కి వచ్చేవారు సుందర ప్రాంతాల్లో పేరకుపోతున్న చెత్తతో అసహనానికి గురి కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవడం అవసరమని అభిప్రాయపడ్డాడు. బహ్రెయిన్ వ్యాప్తంగా స్కూళ్ళలో పర్యటించి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడం, పరిసరాల పరిశుభ్రతపై క్లాసులు నిర్వహించాలనుకోవడం తన ముందున్న లక్ష్యాలని అహ్మద్‌ఖాన్ వివరించాడు. ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒకటైన బహ్రెయిన్, ప్రపంచంలోనే అతి పెద్ద సమస్య అయిన పొల్యూషన్‌తో సతమతమవడం తనకు బాధ కలిగిస్తోందని చెప్పాడు అహ్మద్. కట్టుదిట్టమైన చట్టాలతో, అలాగే పౌరుల్లో అవగాహనతో సింగపూర్ దేశం పొల్యూషన్‌ని అధిగమించగలిగిందనీ, పరిశుభ్రంగా ఉంటోందని అహ్మద్‌ఖాన్ వివరించాడు. 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం బహ్రెయిన్ పొల్యూటెడ్ దేశాల్లో బహ్రెయిన్‌కి 10వ స్థానం దక్కిన విషయాన్ని అహ్మద్‌ఖాన్ గుర్తు చేశాడు.
తాజా వార్తలు
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!







