రాజ్యసభ సభ్యత్వానికి సినీ నటుడు మిథున్ రాజీనామా
- December 26, 2016
సినీ నటుడు, రాజ్యసభ ఎంపీ మిథున్ చక్రవర్తి సోమవారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్లే రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన రాజీనామాను టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్ ధ్రువీకరించారు. ఆయనతో సత్సంబంధాలు ఎప్పటికీ కొనసాగిస్తామని, త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఒబ్రెయిన్ తెలిపారు.
2014 ఏప్రిల్‌లో పశ్చిమ్ బంగాలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున మిథున్ చక్రవర్తి రాజ్యసభకు ఎంపికయ్యారు. రాజ్యసభ సమావేశాల సమయంలో ఆయన రెండేళ్లలో కేవలం మూడు రోజుల పాటే సమావేశాలకు హాజరవడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.డిస్కో డ్యాన్సర్‌గా ఒకప్పుడు యువతరాన్ని ఉర్రూతలూగించిన మిథున్ చక్రవర్తి ఇటీవల తెలుగులో పవన్ కల్యాణ్, వెంకటేశ్ నటించిన 'గోపాలగోపాల' చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కన్పించారు. ఆ చిత్రంలో ఆయన నటనకు గాను విమర్శకుల నుంచి సైతం ప్రశంసల్ని అందుకున్నారు.
తాజా వార్తలు
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు







