సేమియా షీర్..
- December 26, 2016
కావలసినవి: వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు సేమియా (వెర్మిసెల్లి) - పావు కప్పు, పంచదార - అరకప్పు, పాలు - మూడు కప్పులు, డ్రైఫ్రూట్ ముక్కలు - కొన్ని, కిస్మిస్, కర్జూరాలు - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, సార పప్పు - ఒక టీస్పూన, యాలక్కాయ పొడి - అర టీస్పూన, రోజ్ వాటర్ - రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ: లోతైన గిన్నెలో వెన్న వేడిచేసి వెర్మిసెల్లిని బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి.తరువాత పంచదార, పాలు పోసి పంచదార కరిగే వరకు వేడిచేయాలి.
తరువాత డ్రైఫ్రూట్స్ ముక్కలు, కిస్మిస్ వేసి బాగా కలిపి సన్నని సెగ మీద మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత తాజా కర్జూరా ముక్కలు, సార పప్పు, యాలక్కాయ పొడి, రోజ్‌వాటర్ కలిపి సన్నని మంటమీదే మరో రెండు నిమిషాలు ఉంచాలి. షీర్ చిక్కగా అనిపిస్తే కొన్ని వేడినీళ్లు కలపాలి. స్టవ్ మీద నుంచి దించి వెంటనే వేడిగా తినేయొచ్చు. లేదా చల్లారాక తిన్నా బాగానే ఉంటుంది. తినేటప్పుడు యాలక్కాయ పొడి కొద్దిగా చల్లుకుంటే బాగుంటుంది.
తాజా వార్తలు
- ఒమన్ జాతీయ దినోత్సవ వేడుకలు..GCC దేశాల్లో ఒమన్ జెండా రంగులతో మెరిసిన భవనాలు
- ఒమన్ 56వ జాతీయ దినోత్సవ వేడుకలు..ఒమన్ ప్రయాణికులకు షార్జా విమానాశ్రయం ప్రత్యేక స్వాగతం
- ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు రోడ్ షోల్డర్ పై వాహనాలు నడిపితే జరిమానా..
- ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్..
- షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమికి విజయవంతంగా శస్త్రచికిత్స
- పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసన
- దుబాయ్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు..13 నెలల కనిష్ఠానికి ధర..!!
- KAFD పై దాడులను తీవ్రంగా ఖండించిన GCC..!!
- UNO సూచీలో ఒమన్‌కు మెరుగైన ర్యాంకు..!!
- కువైట్‌లో 494 భవనాలు కూల్చివేత.. ఆదేశాలు జారీ..!!







