చరిత్ర తిరగరాసిన లెజెండ్ సినిమా
- December 26, 2016
నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా సరికొత్త రికార్డు నమోదు చేసింది. దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో నాలుగు అంకెల రోజులు ప్రదర్శితమైన సినిమాగా చరిత్ర సృష్టించింది. సోమవారం నాటికి ఈ సినిమా 1005 రోజులు పూర్తి చేసుకుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన ధియేటర్ లో నిర్విరామంగా వెయ్యి రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుందని వెల్లడించారు. సౌత్ ఇండస్ట్రీలో ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా 'లెజండ్' నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. తమ అభిమాన నటుడి సినిమా సక్సెస్ ఫుల్ గా వెయ్యి రోజులు పూర్తి చేసుకోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
కేక్ కట్ చేసి, బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'లెజెండ్' సినిమా 2014, మార్చి 28న విడుదలైంది. జగపతిబాబు తొలిసారిగా ఈ సినిమాలో విలన్ గా నటించాడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







