త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ఓకే అయ్యింది..
- December 26, 2016
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాలని ఆశపడ్డాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. 'జనతా గ్యారేజ్ తర్వాత త్రివిక్రమ్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. చివరికి తారక్ కోరిక ఫలించింది. తారక్ - త్రివిక్రమ్ సినిమా ఓకే అయ్యింది. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం తారక్ కి అడ్వాన్సులు కూడా ముట్టాయని ఫిల్మ్ నగర్ సమాచారమ్.
ఇప్పుడు త్రివిక్రమ్ - తారక్ సినిమా ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. వచ్చే యేడాది ఆగస్టు లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాతో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు త్రివిక్రమ్. వచ్చే యేడాది ఫిబ్రవరి నుంచి పవన్ - త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ఆగస్టు 10న రిలీజ్ కానుంది.
మరోవైపు, ఎన్టీఆర్-బాబీల చిత్రం ఈ సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే యేడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందులు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టులోగా అటు త్రివిక్రమ్, ఇటు ఎన్ టీఆర్ ఫ్రీ అయిపోనున్నారు. ఇక, ఆగస్టులో త్రివిక్రమ్ - తారక్ జతకట్టబోతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–భారత్ సాంస్కృతిక సహకారానికి మరింత బలోపేతం
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!
- యూఏఈలో భారీగా క్రిస్టల్ మెత్ పట్టివేత..!!
- రిజిస్ట్రేషన్ లేని పెప్టైడ్ల విక్రయంపై సౌదీ కఠిన చర్యలు..!!
- బహ్రెయిన్‌లో ఐదుగురు ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్







