త్వరలో మెట్రో రైలు పరుగులు విజయవాడ లో..
- December 27, 2016
విజయవాడ మెట్రో రైల్ విషయంలో ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ప్రాజెక్ట్ నిర్మాణానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. తాజాగా వచ్చే ఐదేళ్లకు అవసరమైన నిధులను లోన్ల రూపంలో తీసుకునేందుకు లభించింది. విజయవాడ లో త్వరలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తయ్యేలోగా... మెట్రో రైలు మొదటి దశ పూర్తి చేయాలని ప్రభుత్వం ధృడసంకల్పంతో ఉంది.2018 కల్లా తొలి దశ పూర్తి చేయడం టార్గెట్‌గా పనుల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఏపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. రెండు కారిడార్లకు సంబంధించి DMRC ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు సమకూరస్తుండగా.. రాష్ట్రప్రభుత్వం 20 శాతం నిధులు భరించాల్సి ఉంది. తాజాగా ఏపీ సర్కార్ వాటాపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. వచ్చే ఐదేళ్లకు మొత్తం 2వేల159 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.ఇప్పటికే 300 కోట్లు విడుదల చేసినందున ఇంకా 18వందల 59 కోట్లు అవసరం అని లెక్క వేసింది.ఈ మొత్తాన్ని హాడ్కో లేదా ఇతర బ్యాంకుల నుంచి మూడేళ్ళలో చెల్లించేలా ఋణం తీసుకునేందుకు అమరావతి మెట్రో కార్పొరేషన్ కు అనుమతినిచ్చింది. ఈ రుణానికి ప్రభుత్వం గారంటీ ఇచ్చింది. రాష్ట్ర నిధులపై క్లారిటీ రావడంతో త్వరలోనే కేంద్ర నిధులపైనా స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అయితే గతంలో జైకా వంటి సంస్థలతో రుణాల కోసం ప్రయత్నం చేసినా...నిబంధనలు అడ్డుపడటంతో హాడ్కో నిధులతో మెట్రో పనులు వేగం కానున్నాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







