నూతన సంవత్సరానికి మారణహోమానికి కుట్ర
- December 28, 2016
నూతన సంవత్సరం వేళ ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. కొత్త సంవత్సర వేడుకల్లో ప్రజలు తలమునకలై ఉండగా మారణహోమం సృష్టించేందుకు వీరు కుట్ర చేసినట్లు తమకు సమాచారం అందినట్లు బంగ్లా పోలీసులు చెప్పారు. వీరంతా కూడా జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) సంస్థకు చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. ఇది ఒక నిషేధిత సంస్థ. ఇస్లామిక్ స్టేట్ తో కూడా దీనికి సంబంధాలు ఉన్నాయని సమాచారం. గతంలో జూలై 22న బంగ్లాలోని కేఫ్ దాడిలో జరిగిన మారణహోమానికి జేఎంబీనే కారణం అని పోలీసులు నిర్ధారించారు కూడా.
కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో అనుమానిత ప్రాంతాల్లో గత రాత్రి తనిఖీలు నిర్వహించిన పోలీసులకు ఈ ఐదుగురు వ్యక్తులు అనుమానంగా కనిపించడంతోపాటు అడిగిన ప్రశ్నలకు సంబంధం లేని సమాధానాలు చెప్పారు.మరిన్ని తనిఖీలు నిర్వహించగా వారి వద్ద 60 కేజీల పేలుడు పదార్థాలు లభించాయి. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ఇప్పటికే ఢాకాలో 31, జనవరి 1 తేదీల్లో పెద్ద మొత్తంలో ఒకచోట చేరి పార్టీలు నిర్వహించుకోకుండా నిషేధం విధించింది
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







