ఆర్మీకాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి..

- December 28, 2016 , by Maagulf
ఆర్మీకాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి..

జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బందిపొరాలో గస్తీ దళాల లక్ష్యంగా ఈ దాడి జరిగింది. వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఆర్మీ ఎదురు కాల్పులు ప్రారంభించగానే ఉగ్రవాదులు అక్కడినుంచి పరారయ్యారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com